గోవా బీచ్‌లో నిహారిక గ్యాంగ్ దుమారం

-

టాలీవుడ్‌లో వ‌రుస వెడ్డింగ్‌ల హంగామా న‌డుస్తోంది. మునుపు ఎన్న‌డూ లేని విధంగా స్టార్స్ అంతా పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే కొంత మంది పెళ్లి చేసుకోగా మ‌రి కొంత మంది అందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఆ జాబితాలో ముందు వ‌రుస‌లో వుంది మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక‌. గ‌త కొంత కాలంగా నిహారిక వివాహానికి సంబంధించి వార్త‌లు షికారు చేస్తున్న విష‌యం తెలిసిందే.


తాజాగా గుంటూరుకు చెందిన ఐజీ ప్ర‌భాక‌ర‌రావు త‌న‌యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక వివాహం జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. పెళ్లికి ఇరు కుటుంబాల వారు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో ఆగ‌స్టులో గుంటూరు వాస్త‌వ్యుడు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో నిహారిక నిశ్చితార్థం జ‌రిగింది. డిసెంబ‌ర్‌లో వివాహం కోసం ఇరు కుటుంబాల వారు ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లికి మ‌రో రెండు నెల‌లు స‌మ‌యం వుండ‌టంతో నాజూగ్గా క‌నిపించ‌డానికి నిహారికి జిమ్‌లో వ‌ర్క‌వుట్లు చేస్తోంది.

తాజాగా నిహారిక త‌న ఫ్రెండ్స్‌కి  బ్యాచిల‌ర్ పార్టీని ఇచ్చిన‌ట్టు తెలిసింది. స్పెష‌ల్ పార్టీ కోసం స్నేహితుల‌తో క‌లిసి గోవాకి వెకేష‌న్‌కి వెళ్లింది నిహాకి. అక్క‌డ త‌న ఫ్రెండ్స్‌తో చిట్టిపొట్టి డ్రెస్సుల్లో దుమారం రేపుతోంది. నిహారిక‌తో పాటు ఆమె ఫ్రెండ్స్ గోవా బీచ్‌లో చిట్టి షార్ట్స్‌లో చేసిన హంగామా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version