నిహారిక కొణిదెల.. మెగా డాటర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా, యాంకర్ గా , నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది. ఇకపోతే 2020 డిసెంబర్లో గుంటూరు ఐ జి కుమారుడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న నిహారిక అతడితో ఎక్కువ కాలం కొనసాగలేక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. గత కొద్దిరోజుల నుంచి వీళ్లిద్దరు విడాకులు తీసుకున్నారని వార్తలు వచ్చినప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ నిన్నటితో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లుగా అధికారిక ప్రకటన వెలువడింది.
దీంతో పలువురు నిహారికపై రకరకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పుడు తెరపైకి మరొక వార్త వచ్చింది. అదేమిటంటే ఒక స్టార్ హీరోయిన్ ని ఆమె ఇన్స్పిరేషన్ గా తీసుకొని విడాకులు తీసుకుందని వార్త ఇప్పుడు మరింత సంచలనం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళితే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత అంటే నిహారికకు ఎనలేని అభిమానమే కాదు ఇష్టం కూడా.. ముందు నుంచి సమంతాను అన్ని విషయాలలో ఫాలో అవుతున్న నిహారిక.. ఇప్పుడు ఇలా వ్యక్తిగత జీవితంలో కూడా ఆమెనే ఫాలో అయ్యిందని అందుకే సమంత లాగే తాను కూడా త్వరగానే విడాకులు తీసుకుంది అంటూ ఇప్పుడు ఒక కొత్త రూమర్ తెరపైకి వచ్చింది.
అయితే ఇలా ఈ వార్తలు తెరపైకి రావడంతో ఇది తెలిసిన చాలామంది నిహారిక..తన వ్యక్తిగత జీవితాలను ఇంకొకరితో పోల్చుకోవడం ఏంటి అంటూ మండిపడుతున్నారు. ఇకపోతే విడాకులు తీసుకున్న సమయంలో తనను మానసికంగా ఎవరు ఇబ్బంది పెట్టద్దని ఒక లాంగ్ నాట్ రిలీజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఇకపై తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలి.