ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని మోడీ.. రూ.6,100 పనులకు శ్రీకారం

-

ఈ నెల 8న తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. ఈ సందర్బంగా రూ.6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూలై 7-8 తేదీల్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో భాగంగా నాలుగు రాష్ట్రాలో పర్యటించనున్నారు. జూలై 7న చత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌లను సందర్శిస్తారు. జూలై 8న తెలంగాణ, రాజస్థాన్‌లలో పర్యటించనున్నారు.

జులై 8వ తేదీ ఉదయం 10:45 గంటలకు, ప్రధానమంత్రి తెలంగాణలోని వరంగల్‌కు చేరుకుని, దాదాపు రూ.6,100 కోట్ల విలువైన పలు కీలకమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, బహిరంగ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలంగాణలోనూ రూ.6,100 కోట్ల విలువైన ప్రధాన మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా రూ.5,550 కోట్ల విలువైన 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ప్రాజెక్టులకు పునాది వేస్తారు. ఇందులో నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌ కింద 108 కిలోమీటర్ల మంచిర్యాల-వరంగల్ సెక్షన్‌ కూడా ఒకటిగా ఉంది. కాజీపేటలో రూ.500 కోట్లతో గూడ్సు రైలు వ్యాగన్ల తయారీ కర్మాగారం నిర్మాణానికి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version