టాయిలెట్ గ‌ది లో ప్ర‌చారం..అద్దంలో దెయ్యం!

-

సినిమా బొమ్మ గోడ‌పై అంటిస్తే ఎవ‌రు చూస్తారు? రోటీన్ గా ప్ర‌చారం చేస్తే జ‌నాల్లోకి ఎలా వెళ్తుంది? అందులో వెరైటీ ఉండాలి క‌దా. అందుకే ఓ సినిమా యూనిట్ త‌మ సినిమాని టాయిలెట్ గ‌దుల్లో ప్ర‌చారం చేయ‌డం ప్రారంభించింది. స‌రిగ్గా టాయిలెట్ పాయింట్ వ‌ద్ద నీ ప‌క్క సీటులో కూర్చున్న‌ది నేనే..దెయ్యాన్ని క‌దా! క‌నిపించి ఉండ‌ను. ఫాస్ట్ గా జిప్ మూసేయ్. అద్దం చూడొదు . అందులో దెయ్యం క‌నిపిస్తుందంటూ స‌రికొత్త ప్ర‌చారానికి తెర‌లేపాడు సందీప్ కిష‌న్. ఆ విష‌యంలో లేడీస్ బాత్రూమ్ ల‌ను సైతం సందీప్ వ‌ద‌ల్లేదు. దాదాపు ప్ర‌తీ పాయింట్ ను క‌వ‌ర్ చేసాడు. ఇది చూసిన జ‌నాలు ప్ర‌చారానికి కొత్త పోక‌డ‌లాంది? అంటూ ముచ్చ‌టించుకోవ‌డం మొద‌లు పెట్టారు.

Ninu Veedani Needanu Nene Cinema promotions in toilet room

సందీప్ ఇప్పుడు నిను వీడ‌ని నీడ‌ను నేనే అంటూ ఓ సినిమా చేస్తున్నాడు. హార‌ర్ థ్రిల్ల‌ర్ ఇది. ఈ కామెడీని థ్రిల్ల‌ర్ లోని థీమ్ ని ప్ర‌జెంట్ చేసేలా డిజైన్ చేసిన కొన్ని కోట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. అందులో భాగంగా కొన్నింటిని మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ బాత్రూమ్ ల్లో అంటించి ఇలా ర‌చ్చ చేస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలా టాయిలెట్ ముందు ఏ సినిమా ప్ర‌చారం చేయ‌లేదు. దీంతో వాష్ రూమ్ కి వెళ్లిన వారిలో కొంద‌రు న‌వ్వుకుం టున్నారు. ఇంకొంద‌రు ఇది సినిమా పోస్ట‌రా? లేక సిబ్బంది ఇలా అంటించారా? అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కార‌ణం ఏదైనా సందీప్ సినిమాకు మాత్రం మంచి ప‌బ్లిసిటీ వ‌స్తోంది. ఏదైనా నీను వీడ‌ని నీడ‌ను నేను టీమ్ అక్క‌డ కూడా ప్రెవ‌సీ లేకుండా చేసింది.

గంట‌కు పైగా థియేట‌ర్లో కూర్చొని ప్ర‌శాంతంగా వాష్ రూమ్ లోకి ప‌నికాద్దాం! అనుకున్న వారికి మాత్రం ఇది క‌చ్చితంగా డిస్ట‌బెన్స్ అవుతుంది. ఆలోచ‌న ట్రెండీ గా ఉంది కాబ‌ట్టి..ఇక‌పై చాలా మంది ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు ఈ ప‌ద్ద‌తిని వ‌దిలిపెట్ట‌రేమో అనిపిస్తోంది. ఈ త‌ర‌హా ప్ర‌చారానికి యాజ‌మాన్యాలు నిర్మాత‌ల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌చారం పేరుతో గ‌ట్టిగానే గుంజుతున్నాయని ఓ యాండ్ కంపెనీ ద్వారా తెలిసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version