“రంగ్ దే” ఫస్ట్ లుక్ లో నితిన్ కీర్తి సురేష్ ల రొమాన్స్ …!

-

అ..ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నితిన్ కి ‘భీష్మ’ సినిమాతో మంచి హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి వచ్చాడు యంగ్ హీరో నితిన్. దాదాపు రెంశేళ్ళ్ములౌ అవుతోంది నితిన్ కి హిట్ పడి. ఆ కసి తో ఛలో దర్శకుడు వెంకీ కుడుముల తో కమిటయి మంచి హిట్ ని దక్కించుకున్నాడు. కన్నడ బ్యూటి రష్మిక మందన్న నితిన్ ల కాంబినేషన్ లో వచ్చిన భీష్మ కమర్షియల్ సక్సస్ ని అందుకుంది. కరోనా ఎఫెక్ట్ గాని లేకపోతే భారీ కలెక్షన్స్ నే రాబట్టేది. అయినా సినిమా మేకర్స్ కి ప్రాఫిట్ నే ఇచ్చింది.

ఇక ఇదే ఊపుతో నితిన్ మరో యువ దర్శకుడు వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడట వెంకీ అట్లూరి. ఇక ఈ సినిమా మహానటి ఫేం కీర్తి సురేష్ నితిన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. మహానటి అగ్నాతవాసి తర్వాత మళ్ళీ కీర్తీ సురేష్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఈ సినిమా మీద నితిన్ కీర్తి సురేష్ కాంబినేషన్ మీద ప్రేక్షకులకి మంచి అంచనాలున్నాయి. ఇక రేపు (మార్చి 30) నితిన్ బర్త్ డే సందర్భంగా ‘రంగ్ దే’ నుండి ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌లను విడుదల చేశారు చిత్ర యూనిట్.

ఈ ఫస్ట్‌లుక్‌లో నితిన్, కీర్తి సురేష్‌లు చాలా రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రం హిట్ కావడంతో నితిన్‌-నాగవంశీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా.. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ వేసవిలో ‘రంగ్ దే’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version