నితిన్- శ్రీలీల సినిమా నుంచి క్రేజీ అప్డేట్

-

టాలీవుడ్ యంగ్ హీరో హిట్ చూసి చాలా కాలమే అయింది. అప్పుడెప్పుడో భీష్మతో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత నుంచి వచ్చిన సినిమాలు వచ్చినట్టే వెళ్లిపోయాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన మాచర్ల నియోజకవర్గం కూడా పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో ఆశలన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో శ్రీలీలతో కలిసి నటిస్తున్న సినిమాపైనే ఉన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ఓ అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను జులై 23న రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఈ సినిమాకు ఎగస్ట్రా అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆర్టీనరీ మ్యాన్‌ అనేది ఉపశీర్షిక అని టాక్.  ఈ సినిమాను వినాయక చవితికి విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. వరుస ఫ్లాప్ లలో ఉన్న నితిన్ తు.. సూర్య సన్ ఆఫ్ ఇండియాతో ఫ్లాప్ మూట గట్టుకున్న వంశీకి ఈ సినిమా చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version