జూలై 25న అక్టోబర్ కోటా టికెట్లు విడుదల

-

జూలై 25న అక్టోబర్ కోటా టికెట్లు విడుదల తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను జూలై 25వ తేదీ ఉ.10 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. దీంతో పాటు ఆగస్టు, సెప్టెంబర్ నెలల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం అదనపు కోటాను కూడా విడుదల చేస్తామంది. అటు అక్టోబర్ నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్లు, వికలాంగుల కోటా టోకెన్లు జూలై 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతాయి.

ఇదిలా ఉంటే.. టీటీడీ శ్రీవాణి ట్రస్ట్, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఆన్ లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. 24న మధ్యహ్నం 3 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version