Nithin : మహా శివరాత్రికి ‘తమ్ముడు’ వచ్చేస్తున్నాడు.. పోస్టర్ రిలీజ్

-

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్స్ కొట్టి ఇటీవల మాత్రం కాస్త స్లో అయ్యాడనే చెప్పాలి. త్వరలోనే రాబిన్ హుడ్ మూవీతో రాబోతున్నాడు. ఇక ఆ తరువాత మరో ఆసక్తికరమైన మూవీతో రాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు టైటిల్ ని నితిన్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రాబోతుంది. పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీలో అన్న తమ్ముడు సెంటిమెంట్ అయితే.. నితిన్ తమ్ముడు మూవీలో అక్కా తమ్ముడు సెంటిమెంట్ ఉండనుంది.

ఈ మూవీలో నితిన్ అక్కగా ఒకప్పటి హీరోయిన్ లయ నటిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేని తమ్ముడు మూవీ నుంచి తాజాగా రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. ఓ పోస్టర్ విడుదల చేశారు. తమ్ముడు మూవీ 2025 మహా శివరాత్రికి రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. పోస్టర్ లో నితిన్ ఓ చిన్న పాపను భుజం పై ఎక్కించుకొని చేతిలో వెలుగుతున్న కాగడా పట్టుకొని ఉన్నాడు. కొంత మంది తరుముతుంటే పరిగెడుతున్నట్టు కనిపిస్తోంది. ఇది యాక్షన్ సీన్ లోని ఈఫొటో అని అర్థమవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version