కాసేపట్లో బాలు అంత్యక్రియలు.. ఎవరికీ అనుమతి లేదు !

-

బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఇవాళ చెన్నై తామరైపాకంలోని ఆయన ఫాంహౌస్‌ లో జరగనున్నాయి. అంత్యక్రియలకు అభిమానులెవరూ తరలిరావొద్దని కోరారు తిరువళ్లూరు పోలీసులు. కరోనా వేళ భౌతిక దూరం పాటించే వీలు లేకుండా, అభిమానుల తాకిడి అంతకంతకూ పెరుగు తుండటంతో కుటుంబ సభ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే అంత్యక్రియల నిర్వహణ సమయంలో అభిమానులు పోటెత్తకుండా ఫాం హౌస్ నుండి కొంత దూరం వరకూ బారికేడ్లు ఏర్పాటు చేశారు.

అభిమానులు భారీగా పోటెత్తకుండా… పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఇక ఈ అంత్యక్రియలకి కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారితో పాటు కొంత మంది సన్నిహిత సినీ వర్గాల వారు హాజరీ అయ్యే అవకాసం ఉంది. ఇక తమిళనాడు సీఎం పళని స్వామి ఏపీ తరపున బాలు సొంత జిల్లాకి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ లు హాజరు కానున్నారు. తెలంగాణా తరపున ఎవరైనా హాజరు అవుతున్నారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version