మాస్క్ విషయంలో వాళ్లే జాగ్రత్తగా ఉన్నారట !

-

దేశంలో కరోనా వ్యాప్తి తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మాస్క్‌లు తప్పని సరి చేసింది. కొన్ని చోట్ల ఏంటి దాదాపు అన్ని చోట్లా మాస్క్ లు లేకుండా పోలీసుల కంట పడితే జరిమానాలు కూడా విధిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే పూర్తిగా సీసీ కెమెరాలకి లింక్ చేసి మరీ వారి ముఖాలని స్కాన్ చేసి ఫైన్ లు వేస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా 44 మంది మాత్రమే మాస్క్‌లు ధరిస్తున్నట్టు తాజా సర్వేలో తేలింది.

అప్నా మాస్క్‌ పేరిట ఏక్‌ దేశ్‌ అనే స్వచ్ఛంద సంస్థ 18 నగరాల్లో నిర్వహించిన సర్వేలో మాస్క్‌ లు ధరిస్తున్నవారు కేవలం 44 శాతమేనని తేలింది. ఈ సర్వేలో మాస్క్‌ తో శ్వాసకు ఇబ్బంది అని 50 శాతం మంది చెప్పగా, అసౌకర్యమే కానే తప్పదుగా అని 44 శాతం మంది అన్నారు. అలానే వైరస్‌ నిరోధానికి భౌతిక దూరం పాటిస్తే సరిపోతుందనే భావనలో 45 శాతం మంది ఉన్నట్టు తేలింది. అయితే ఈ మైండ్ సెట్ ఉన్న వారిలో 26 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యవారు ఎక్కువని, వీరు కరోనా మనకు రాదులే అనే ఆలోచనలో ఉన్నారని ఈ సర్వేలో తేలింది. తెలిపింది. అయితే 36-55 ఏళ్ల మధ్య వారు మాత్రం మాస్క్‌ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారని పేర్కొంది. అదీ కాక ఈ మాస్క్ వేసుకునే విషయంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ కాన్షియస్ గా ఉన్నారని ఈ సర్వే తేల్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version