సింగర్ నోయెల్ ఇంట తీవ్ర విషాదం

-

ప్రముఖ సింగర్ నోయల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్ తండ్రి శనివారం రాత్రి కన్నుమూశారు. నోయల్ తండ్రి శ్యాముల్ సేన్ రిటైర్డ్ డిఫరెన్స్ ఉద్యోగి. అయితే నోయెల్ తండ్రి మరణవార్త తెలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, నోయెల్ ఇంటికి వెళ్లి సంతాపం తెలియజేశారు. నోయల్ అభిమానులు సోషల్ మీడియాలో నోయల్ తండ్రికి నివాళులు అర్పిస్తూ, ఆ బాధ నుంచి నోయెల్ బయటకి రావాలని కోరుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.

ఇక ర్యాప్ సింగర్ గా నోయల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ర్యాపర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నోయెల్ సింగర్ గానే కాకుండా నటుడిగా పలు సినిమాల్లో నటించారు. అటు బిగ్ బాస్ తెలుగు సీజన్ – త్రీ లో కంటెస్టెంట్ గా కూడా పాటిస్పేట్ చేసి మరింత ఫేమ్ సంపాదించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version