హైదరాబాద్‌ లో 13 నుంచి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు !

-

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్. పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ కైట్ & స్వీట్ ఫెస్టివల్ సందర్భంగా.. సికింద్రాబాద్ వద్ద 13 నుంచి 15 వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రోటరీ ఎక్స్ రోడ్ నుంచి ఎస్‌బీహెచ్‌కు వెళ్లే దా రి.. YMCA నుంచి క్లాక్ టవర్‌కు మళ్లింపు చేస్తున్నారు. రసూల్‌పురా నుంచి ప్లాజాకు వెళ్లే దారి.. CTO ‘X’ రో డ్స్ నుంచి బలంరాయికి మళ్లింపు చేస్తున్నారు.

Traffic restrictions are continuing at Secunderabad from 13th to 15th

పికెట్ నుంచి SBH & టివోలికి వెళ్లే మార్గం.. స్వీకార్ ఉపకర్ వద్ద YMCAకు మళ్లిస్తున్నారు. NCC నుంచి ప్లాజాకు వెళ్లే మార్గం.. టివోలి వద్ద నుంచి బ్రూక్‌బాండ్‌కు మళ్లిస్తున్నారు. గేట్ నం.1 నుంచి పబ్లిక్ ఎంట్రీకి అనుమతి.. ఐదు ప్రాంతాల్లో పార్కింగ్‌కి వెసులుబాటు కల్పించనున్నారు. ఈ ఆంక్షల్ని దృష్టిలో పెట్టుకొని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు చేరాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version