పుట్టిన ఊరును, కన్నతల్లిని ఎప్పటికీ మరవద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో సంక్రాంతి సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలలో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకటయ్య నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సంక్రాంతికి ప్రతీ ఒక్కరూ సొంతూరు వెళ్లి పండుగ జరుపుకోవాలని సూచించారు.
తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యం ఉందని.. అలాంటి తెలుగు నేలపై పుట్టిన మనం.. ఇంటితో పాటు వీధి, గుడి, బడి అన్ని ప్రాంతాల్లో తెలుగులో మాట్లాడాలని సూచించారు. అదేవిధంగా భారతీయ సంస్కృతిలో విలీనం అయిన విలువను పాటిస్తూ.. యువత ముందుకు సాగాలని సూచించారు. పండుగ అంటే కుటుంబాల కలయిక అని పండుగ అంటే పక్క వారితో కలిసిపోవడం అని, పండుగ అంటే సేవా కార్యక్రమాలు చేయడం అని మనమంతా వసుదైక కుటుంబం అని ప్రపంచం మొత్తం ఒకే కుటుంబంలా ఉండే సిద్ధాంతం మనదని చెప్పుకొచ్చారు వెంకయ్య నాయుడు.