టైగర్-3లో ఎన్టీఆర్ – బాలీవుడ్​ ఎంట్రీ ఈ సినిమాతోనేనా..?

-

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హృతిక్ రోషన్​తో కలిసి వార్-2లో నటిస్తారని ఇన్నాళ్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఆ సినిమా కంటే ముందే మరో స్టార్ హీరో మూవీతో ఎన్టీఆర్ బీ టౌన్​ ఎంట్రీ ఉండనుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే.?

దీపావళి రోజున విడుదలవుతున్న సల్మాన్ ఖాన్- కత్రినా కైఫ్ మూవీ టైగర్-3లో తారక్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా కామియోల గురించి చాలా వార్తలొచ్చాయి. ఈ చిత్రంలో పఠాన్‌గా షారుక్‌ ఖాన్‌, మేజర్‌ కబీర్‌ ధలీవాల్‌ పాత్రలో హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రల్లో తళుక్కున మెరవనున్నారట. అయితే ఈ సినిమాతోనే ఎన్టీఆర్‌ని కూడా పరిచయం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరో 24 గంటలు వేచి ఉండాల్సిందే. మనీష్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్‌ 3’లో ఇమ్రాన్‌ హష్మీ కీలక పాత్రలో నటించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version