IPL 2024 ఆడేందుకు పంత్ వచ్చేస్తున్నాడు – గంగూలీ

-

IPL 2024 ఆడేందుకు పంత్ వచ్చేస్తున్నాడు అని పేర్కొన్నారు ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ గంగూలీ. IPL-2024లో రిషబ్ పంత్ పాల్గొనడంపై ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వాక్యాలు చేశారు. ‘పంత్ గాయాల నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నాడు. ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.

Pant’s blockbuster comeback confirmed as Ganguly provides update on return date

 

వచ్చే ఐపిఎల్ లో కచ్చితంగా ఆడతాడు. డిసెంబర్ 19న దుబాయ్ లో జరగనున్న ఐపీఎల్ వేలానికి ముందు జట్టు నిర్మాణంపై ఫోకస్ చేస్తాం’ అని గంగూలి తెలిపారు. ఇది ఇలా ఉండగా టీమిండియా వికెట్ కీపర్, డాషింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వస్తుండగా కారు డివైడర్ ని ఢీకొనడంతో పంత్ కి తీవ్ర గాయాలయ్యాయి. అయితే అదృష్టం బాగుండి ప్రాణాలతో బయట పడ్డ పంత్ చికిత్స తీసుకొని వేగంగా కోలుకుంటున్నాడు. అయితే.. పంత్ కాలికి, వీపుకు బలమైన గాయాలు కావడంతో, చాలాకాలం మంచానికే పరిమితం అయ్యాడు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version