ఆదిపురుష్ వివాదం వేళ.. రావణుడిపై NTR కామెంట్స్ వైరల్

-

ఆదిపురుష్ సినిమాలో రావణుడిని చూపిన విధానంపై తీవ్ర వివాదం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఆదిపురుష్ టీమ్​పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ గతంలో తాను నటించిన జై లవకుశ సినిమా ప్రమోషన్స్​లో భాగంగా రావణాసురుడి గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది.

ఇంటర్వ్యూలో ఎన్టీఆర్​ను యాంకర్.. రావణుడి గురించి సాధారణంగా అందరికీ తెలియని విషయాల గురించి ఏమైనా పరిశోధన చేశారా? అని ఓ ప్రశ్న అడిగింది. ప్రశ్నకు స్పందించిన ఎన్టీఆర్..” అటువంటి పౌరాణికానికి సంబంధించి పాత్రలు చేస్తున్నప్పుడు.. కొత్తగా ఇన్ఫర్మేషన్ వెతుక్కునే అవసరం లేదు. మన దగ్గర ఇన్ఫర్మేషన్ పాడు చేయకుంటే చాలు” అని సమాధానం ఇచ్చాడు.

“రావణుడి గురించి మరింత లోతుగా తెలుసుకోడానికి ఆనంద్ నీలకంఠ రాసిన ‘అసుర’ అనే పుస్తకాన్ని చదివాను. ఆ పుస్తకంలో రామాయణం.. రావణుడి కోణంలో నుంచి ఉంది. వాస్తవానికి రావణుడు 18 లోకాలకు రారాజు. ఆతడు అసురుల చక్రవర్తి. అన్ని లోకాలకు అధిపతి అయ్యాడంటే అతడికి ఎంత నేర్పు ఉండాలి. రాముడు లాంటి వ్యక్తియే యుద్ధం సమయంలో రావణాసురుడు ఎదురుపడగానే.. అతడిని చూడగానే ఇంత గొప్ప వ్యక్తివా నువ్వు అని పద్యాన్ని అందుకున్నాడు. అలా రావణుడు నిలబడితే శత్రువు సైతం అతడిని పొగిడేలా ఉండాలి. అలా ఆ పాత్ర చేసేటప్పుడు నేను కూడా ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి అన్న విషయాలను తెలుసుకున్నాను.ఆ పుస్తకం నాకు ఆ క్యారెక్టర్ చేయడానికి సహాయపడింది.” అని తారక్ చెప్పుకొచ్చాడు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version