టాలీవుడ్ కు కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు అక్కినేని నాగార్జున. తెలుగు సినిమా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ ఫొటోస్ బయటకు వచ్చాయి. అయితే.. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు అక్కినేని నాగార్జున. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, సమంత, కేటీఆర్ ఎపిసోడ్ జరిగిన తర్వాత…. సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించారు అక్కినేని నాగార్జున.
ఈ సందర్భంగా నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. యూనివర్సల్ లెవెల్‌లో స్టూడియో సెటప్ ఉండాలని కోరారు. ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే.. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని కోరారు అక్కినేని నాగార్జున. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది మా కోరిక అని తెలిపారు నాగార్జున. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్ల..ప్రమోషన్‌ను విస్తృతంగా చేస్తున్నామన్నారు.