తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు… సీఎం రేవంత్‌ కీలక ప్రకటన !

-

తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు ఇస్తామని… దీనిపై కమిటీ వేయనున్నట్లు సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. సినీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… టాలీవుడ్‌కు మేం వ్యకిరేఖం కాదు.. టాలీవుడ్‌ సమస్యల పరిష్కారానికి మేం ముందుంటామని ప్రకటించారు.


తెలంగాణలో షూటింగ్‌లకు మరిన్ని రాయితీలు కల్పించాలన్న విజ్ఞప్తిపై కమిటీ వేస్తామని వెల్లడించారు. ముందస్తు అనుమతులు, తగిన బందోబస్తు ఉంటేనే సినిమా ఈవెంట్లకు అనుమతి అన్నారు. ఇకపై బెన్‌ఫిట్ షోలు ఉండబోవని వివరించారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇకపై బెనిఫిట్‌ షోలు ఉండవన్న సీఎం రేవంత్‌… ఇండస్ట్రీ పెద్దలకు తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామన్న రేవంత్‌… శాంతిభద్రతల విషయంలో రాజీ లేదని వివరించారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్‌గా ఉంటామన్న సీఎం రేవంత్‌రెడ్డి…అభిమానుల్ని కంట్రోల్‌ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version