ఎన్టీఆర్ సినిమా కథ చిరంజీవి మూవీ కాపీనా…?

-

టాలీవుడ్ లో ఎన్టీఆర్ సినిమా అనగానే చాలా మందికి ఒక ఆసక్తి ఉంటుంది. కథ ఏ విధంగా ఉంటుంది, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్టీఆర్ సినిమాలకు ఇప్పుడు క్రేజ్ పెరిగింది. సినిమా సినిమాకు అతని రేంజ్ పెరుగుతూ వస్తుంది. కథ విషయంలో ఈ మధ్య ఎన్టీఆర్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చిన్న చిన్న విషయాలను కూడా దృష్టి లో పెట్టుకునే చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావాలని భావించినా కొన్ని కారణాలతో అది వాయిదా పడింది. ఆ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు. ఎన్టీఆర్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

అది ఏంటీ అంటే ఈ సినిమా కథ చిరంజీవి చేసిన మంత్రి గారి వియ్యంకుడు అనే సినిమా కథ ఆధారంగా ఉంటుంది అంటున్నారు. పూర్తి పొలిటికల్, ఫ్యామిలీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి ఆ కథను ఆధారంగా త్రివిక్రమ్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జయకృష్ణ నిర్మించారు. వాళ్ళు ఇద్దరూ ఇప్పుడు బ్రతికి లేకపోవడంతో కథ విషయంలో త్రివిక్రమ్ కి ఏ ఇబ్బంది లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version