ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన ఎన్టీఆర్‌.. స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్!

-

ఎన్టీఆర్ త‌న ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పాడు. ప్ర‌స్తుతం ఆర్ ఆర్ ఆర్‌, కొర‌టాల‌తో త‌న 30వ సినిమా చేస్తున్నాడు తార‌క్‌. ఆర్ ఆర్ ఆర్ పై ఇప్ప‌టికే ఎన్నో అంచ‌నాలున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై ఎన్టీఆర్ ఓ ఇంగ్లీష్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో స్ప‌ష్ట‌త ఇచ్చాడు. ఈ ద‌స‌రాకు సినిమా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని చెప్పాడు.

 

అయితే ఇప్పుడు తార‌క్ చేస్తున్న రెండు సినిమాల నుంచి స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంద‌ని తెలుస్తోంది. మే 20న ఎన్టీఆర్ పుట్టిన‌రోజు. కాబ‌ట్టి ఈ రెండు సినిమాల నుంచి ఎన్టీఆర్ పోస్ట‌ర్ విడుద‌ల అవుతుంద‌ని అభిమానులు ఎంత‌గానో ఎదురు చూస్తున్నారు.

ఇక ఇదే విష‌యంపై ఎన్టీఆర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్‌నుంచి, కొర‌టాల శివ‌తో చేస్తున్న సినిమాల నుంచి ఖ‌చ్చితంగా గిఫ్ట్ ఉంటుంద‌ని హింట్ ఇచ్చేశాడు. ఇప్ప‌టికే పోయిన పుట్టిన రోజుకు వ‌చ్చినే ఆర్ ఆర్ ఆర్ టీజ‌ర్ రికార్డులు బ‌ద్ద‌లు కొడుతోంది. మ‌రి ఈ సారి ఎలాంటి స‌ర్‌ప్రైజ్ ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version