ట్రెండ్ ఇన్: ‘జనతా గ్యారేజ్’ ను మించిన నాటకీయత..కొరటాల శివ-తారక్ కాంబోపై భారీ అంచనాలు

-

జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో తన నటన ద్వారా చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు. భీమ్ పాత్రను ఆయన తప్ప ఇంకెవరూ పోషించలేరనే రీతిలో పర్ఫార్మ్ చేశారు. అలా ఈ ఫిల్మ్ తో తారక్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు కూడా. తారక్ ప్రమోషన్స్‌లోనూ విశ్వరూపం చూపించేశారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లిష్ భాషల్లో ఇరగదీశారు. ప్రశ్న అడిగిన వెంటనే స్పందించి ఊహించని సమాధానాలను ఇచ్చి మీడియా ప్రతినిధులనే సర్ ప్రైజ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

ఈ క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపైన బోలెడంత డిస్కషన్ జరుగుతోంది. ‘జనతా గ్యారేజ్, ఆచార్య’ ఫేమ్ కొరటాల శివతో తారక్ తన 30వ చిత్రం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది కూడా. కాగా, ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే విషయమై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడే హడావిడి చేస్తున్నారు. #NTR30 హ్యాష్ ట్యాగ్ ను మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ అశేష అభిమానుల ట్వీట్స్ తో #NTR30 హ్యాష్ ట్యాగ్ ఎంటర్ టైన్మెంట్ కేటగిరీలో ట్విట్టర్ లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. కానీ, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం ‘ఆచార్య’ చిత్ర ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు.

ఒకసారి ఆ చిత్ర ప్రమోషన్స్, విడుదల పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ 30 వ చిత్రంపైన పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తారు. కాగా, ఈ సినిమా స్టోరిలో నాటకీయత ఎక్కువగా ఉండబోతుందని, నాటకీయత ఉంటేనే చిత్రంపైన ఆసక్తి ఉంటుందని తారక్ పేర్కొన్నట్లు ట్విట్టర్ లో ట్వీట్ చేస్తున్నారు తారక్ అభిమానులు.

చూడాలి మరి.. ఎన్టీఆర్ 30 ఫిల్మ్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో..అయితే, ఈ చిత్రం ‘జనతా గ్యారేజ్’ ను మించి ఉంటుందని అభిమానులు అంటున్నారు. డ్యాన్స్ స్టెప్స్ తో పాటు వైడర్ ఆడియన్స్ అప్పీల్ ఉండే స్టోరితో ఈ సారి తమ అభిమాన హీరో తారక్ దేశవ్యాప్తంగా కలెక్షన్స్ రిపేర్ చస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version