ఆస్కార్ అవార్డ్స్ 2024.. ఉత్తమ అంతర్జాతీయ చిత్రం ‘ది జోన్ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’.. బెస్ట్ హీరో కిలియన్ మర్ఫీ

-

అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌లో 96వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో ఇప్పటికే పలు కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. ఈ ఏడాది 96వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ సినిమా నిలిచింది. 2014లో మార్టిన్‌ అమిస్‌ రచించిన నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. దర్శకుడు జోనాథన్‌ గ్లేజర్‌ హిస్టారికల్‌ డ్రామాగా తెరకెక్కించిన ఈ చిత్రంలో క్రిస్టియన్‌ ఫ్రిడెల్‌, సాండ్రా హుల్లర్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. ఇటీవల జరిగిన బాఫ్టా వేడుకల్లో కూడా ‘ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ మూడు అవార్డులు గెలుచుకుంది. తాజాగా ఆస్కార్ కూడా సాధించింది. మరోవైపు ఉత్తమ నటుడిగా ఓపెన్హైమర్ ఫేం కిలియన్ మర్ఫీ ఆస్కార్ గెలుచుకున్నారు.

ఇప్పటివరకు ప్రకటించిన అవార్డులు..

ఉత్తమ దర్శకుడు : క్రిస్టోఫర్‌ నోలన్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ నటుడు: కిలియన్‌ మర్ఫీ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సహాయ నటుడు: రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ సహాయ నటి: డేవైన్‌ జో రాండాల్ఫ్‌ (ది హోల్డోవర్స్‌)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఓపెన్‌హైమర్‌

ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌: 20 డేస్‌ ఇన్‌ మరియోపోల్‌

బెస్ట్‌ హెయిర్‌ స్టయిల్‌ అండ్‌ మేకప్‌: నడియా స్టేసీ, మార్క్‌ కౌలియర్‌ (పూర్‌ థింగ్స్‌)

బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ ప్లే: కార్డ్ జెఫర్‌పన్‌ (అమెరికన్‌ ఫిక్షన్‌)

బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే: జస్టిన్‌ ట్రైట్‌, అర్థర్‌ హరారీ (అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌)

బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌: ది బాయ్‌ అండ్‌ ది హిరాన్‌

ఉత్తమ కాస్టూమ్‌ డిజైన్‌: హోలి వెడ్డింగ్‌టన్‌ (పూర్ థింగ్స్‌)

బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: జేమ్స్‌ ప్రైస్‌, షోనా హెత్‌ (పూర్‌ థింగ్స్‌)

ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌: ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

ఉత్తమ ఎడిటింగ్‌: జెన్నిఫర్‌ లేమ్‌ (ఓపెన్‌హైమర్‌)

ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌: గాడ్జిల్లా మైనస్‌ వన్‌

ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్‌ సబ్జెక్ట్‌): ది లాస్ట్‌ రిపేర్‌ షాప్‌

ఉత్తమ ఒరిజినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: ఓపెన్‌హైమర్‌

ఉత్తమ సౌండ్‌ : ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌

ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌: వాట్‌ వాస్ ఐ మేడ్‌ ఫర్‌ ( బార్బీ)

లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ది వండర్‌ఫుల్‌ స్టోరీ ఆఫ్‌ హెన్రీ సుగర్‌

 

Read more RELATED
Recommended to you

Exit mobile version