చిరంజీవికి పద్మవిభూషణ్… మెగాస్టార్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

-

Mega Star Chiranjeevi : పద్మ అవార్డులను నిన్న ప్రకటించింది కేంద్రం. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్పకు పద్మశ్రీ, ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ వచ్చింది. వెంకయ్యనాయుడు, చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది.

Padma Vibhushan conferred to Mega Star Chiranjeevi

అయితే, పద్మవిభూషణ్ అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ పురస్కారం రావడంతో ఆనందంతో మాటలు రావట్లేదని అన్నారు. అభిమానులు తన పట్ల చూపిస్తున్న ప్రేమతోనే ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. గత 45 ఏళ్లుగా ప్రేక్షకులను అలరించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అంతేకాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగం అయ్యానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news