75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముర్ము.. జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రయాణంలో ఈ సందర్భం చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. పాశ్చాత్య దేశాల ప్రజాస్వామ్య వ్యవస్థల కన్నా.. భారత ప్రజాస్వామ్యం చాలా ప్రాచీనమైనదనీ తెలిపారు. అందుకే భారత్‌ను ప్రజాస్వామ్యానికి తల్లివంటిదని అంటారని పేర్కొన్నారు.
మన అద్భుతమైన స్పూర్తిదాయకమైన రాజ్యాంగాన్ని రూపొందించిన నాయకులను దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందిరు. రాజ్యాంగ ప్రాథమిక విధులకు కట్టుబడి ఉండాలి. అయోధ్య రామమందిరం భారత నాగరికత, వారసత్వాల పునరావిష్కరణగా చరిత్రలో గుర్తుండిపోతుంది. ప్రజల విశ్వాసానికి, అపారమైన నమ్మకానికి నిదర్శనంగా, ఒక గొప్ప కట్టడంగా విలసిల్లుతుంది. ప్రజాజీవితాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేసిన బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించడం పట్ల సంతోషంకరం. భారత జీడీపీ 2024లోనూ దూసుకుపోతుంది. అని తన సందేశంలో పేర్కొన్నారు.
మరోవైపు చంద్రయాన్‌ను విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, పారిస్ ఒలింపిక్స్‌లో సత్తాచేటిన క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించారు. ప్రపంచంలో నిరాశ్రయుల సంఖ్య తక్కువగా ఉన్న దేశంగా భారత్ ఆవిర్భవించడం గర్వకారణమని కొనియాడారు.