ప్రముఖ మరాఠీ నటి ప్రియా మరాటే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ప్రియా వయసు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులోనే ఈ బ్యూటీ ఈరోజు ఉదయం ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజుల నుంచి క్యాన్సర్ వ్యాధితో ప్రియా బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే యాక్టింగ్ కు విరామం తీసుకున్న ప్రియా క్యాన్సర్ వ్యాధి తగ్గిందని తెలిసి తిరిగి మళ్ళీ ఎప్పటిలానే నటించడం ప్రారంభించారు.

కాగా క్యాన్సర్ వ్యాధి తీవ్రత పెరగడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించారు. ప్రియా 2006 నుంచి టీవీ పరిశ్రమలో విజయం పొందుతున్నారు. 20కి పైగా సీరియల్స్, రెండు సినిమాలలో నటించారు. సుశాంత్ సింగ్ తో కలిసి చేసిన పవిత్ర్ రిష్తా అనే సీరియల్ ద్వారా ఆమె పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అనంతరం ఆమె వెనుదిరిగి చూడకుండా వరుస పెట్టి సినిమాలలో నటించి ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది. తనదైన అందం, నటనకు కోట్లాది సంఖ్యలో అభిమానులు ఉండేవారు. ప్రియా మరాటే మరణంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యాంతం అవుతున్నారు.