మహాభారతంలో ధర్మరాజు పాత్ర కీలకమైనది. ధర్మానికి సత్యానికి ప్రతీకగా నిలిచిన ఆయన జీవితంలో అతిపెద్ద మలుపు జూదం. ఈ జూదం కేవలం ఆట మాత్రమే కాదు, అది పాండవుల జీవితాన్ని కౌరవుల భవిష్యత్తును నిర్ణయించింది. ధర్మరాజు జూదంలో తన రాజ్యాన్ని అన్నదమ్ములను చివరికి భార్య ద్రౌపదిని సైతం పందెం కాసి ఓడిపోవడానికి కారణమైన రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ధర్మరాజు నిర్ణయం వెనుక ఉన్న లోతైన అర్ధాలు చాలామందికి తెలియదు. ధర్మరాజు స్వభావం జూదం ఆట తీరు దానివల్ల కలిగిన పరిణామాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం..
జూదం కథ వెనుక రహస్యం : పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు ధర్మానికి ప్రతీకగా నిలబడతాడు. కౌరవులకన్నా పాండవులు అందరిచేత గణనీయంగా పూజలు అందుకోవడం కౌరవులలో పెద్దవాడైన దుర్యోధనుడికి నచ్చలేదు. ఎలాగైనా పాండవులకున్న రాజ్యాన్ని వారి సౌభాగ్యాన్ని నాశనం చేయాలని దుర్యోధనుడు భావించాడు. అందుకు తన మేనమామ శకుని సహాయం తీసుకున్నాడు. మొదట తన తండ్రి దగ్గరికి వెళ్లి పాండవులు ఎంతో గొప్పగా బతుకుతున్నారు . ఎలాగైనా వారి రాజ్యాన్ని మనం చేజెక్కించుకోవాలంటే మనకు ఉన్న ఒకే ఒక్క దారి జూదం అనే ఆటని వారి చేత ఆడిపించడం. ఈ జూదం శకుని మామ చాలా చక్కగా ఆడతాడు. ఆయనను ఓడించేవారు ముల్లోకాల్లోనే లేరు ఆటలో ధర్మరాజుని బంధించి ఓడిస్తే వారి నుండి వారి రాజ్యాన్ని మనం పొందవచ్చు అని తన తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి చెబుతాడు.

మాయ జూదం ఆటకు పిలవటం:మొదట దృతరాష్ట్రుడు తన కొడుకు చెప్పిన దానికి అంగీకరించడు. తరువాత కొడుకు మీద ఉన్న అమితమైన ప్రేమతో, తన తమ్ముడి పిల్లలు అయినా పాండవులకు అన్యాయం చేయడానికి కూడా వెనుకాడడు. ఇక శకుని తన పాచికలతో జూదం ఆటలో పాండవుల రాజ్యాన్ని సమస్తాన్ని, ఓడిపోయేలా చేస్తానని ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి చెబుతాడు. ఇక దృతరాష్ట్రుడు జూదం ఆటకి పాండవుల్ని పిలవడానికి తన మంత్రి అయిన విదురుడుని పంపిస్తాడు. విదురుడు పాండవుల దగ్గరికి వెళ్లి మీ పెదనాన్నగారు మిమ్మల్ని రాజ్యాన్ని చూడడానికి రమ్మంటున్నారు. అక్కడ జూదం అనే ఒక మాయ ఆటని ఆడి అందులో మిమ్మల్ని ఓడించడానికి వారు పన్నాగం పన్నుతున్నారు. అనే మాటలను ధర్మరాజుకి విధురుడు చెబుతాడు. అది విన్న తర్వాత కూడా ధర్మరాజు నేను నా తమ్ముళ్లు భార్యతో కలిసి అక్కడికి వస్తాను అని విధుడికి చెబుతాడు.
ధర్మరాజు జూదం కు ఒప్పుకోవడానికి కారణం: ధర్మరాజుకి కౌరవుల దగ్గరికి వెళ్లిన తరువాత అక్కడ వారు జూదం అనే మాయ ఆటను ఆడి, తమని ఓడిస్తారన్న విషయం తెలిసి కూడా వెళతాడు. అందుకు కారణం ఆయన క్షత్రియుడు జూదం ఆడడాని సవాలుగా స్వీకరించాలి. అంతేకానీ అవతలి వ్యక్తి ఆడడానికి రమ్మంటే నేను రాను అని అనడం క్షత్రియ ధర్మం కాదని యుధిష్ఠిరుడు ఒప్పుకుంటాడు. ఆడకపోతే పిరికితనం కింద లెక్క కట్టి ఈ సామాజిక ఒత్తిడి, క్షత్రియ ధర్మం ధర్మరాజును జూదం మారడానికి ప్రేరేపించాయి. ఈ జీవితంలో తన సర్వస్వాన్ని కోల్పోయిన సత్యం, ధర్మం పట్ల ఆయనకున్న నిబద్దత చెక్కుచెదరలేదు. ద్రౌపదిని పణంగా పెట్టడం కూడా వ్యూహాత్మ కమైనదిగా కొందరు భావిస్తారు. ఈ జూదం ఆట కేవలం పాండవుల జీవితాలను మార్చడమే కాక మహాభారత యుద్ధానికి దారితీసింది.
గమనిక: ఈ వ్యాసం మహాభారతంలోని ధర్మరాజు పాత్ర, జూదం కథపై రచయిత యొక్క అవగాహన, వివిధ వ్యాఖ్యానాల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం సమాచారంతో కూడిన వ్యాసం మాత్రమే, దీనిని ఒక మత గ్రంథంగా పరిగణించకూడదు.మహాభారతంపై మరింత లోతైన అవగాహన కోసం మూల గ్రంథాలను లేదా ప్రామాణిక వ్యాఖ్యానాలను చదవడం మంచిది.