రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త అందజేసింది ఏపీ ప్రభుత్వం. రేషన్ షాపులలో రేషన్ బియ్యంతో పాటు నూనె, రాగులు, గోధుమపిండి, కందిపప్పు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ప్రజలకు నెల రోజులకు సరిపోయేంత రేషన్ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

నిన్నటి నుంచి కాకినాడ, గుంటూరు, ELR, చిత్తూరు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని నాదెండ్ల మనోహర్ పేరు స్పష్టం చేశారు. సెప్టెంబర్ 15 నాటికి అందరికీ రేషన్ అందేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహరం ప్రజలకు హామీ ఇచ్చారు. దీంతో రేషన్ కార్డులు ఉన్నవారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని సంతోషపడుతున్నారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి నెల రేషన్ పొందుతున్నామని ప్రజలు పేర్కొన్నారు.