అనారోగ్య సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. షాక్ లో ఫ్యాన్స్..!!

-

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే ఎంతోమంది హీరోలు, హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను ఏదో ఒక సమస్యతో బాధపడుతూ తెరపై మాత్రం నవ్వులు చిందిస్తూ ప్రేక్షకులను , అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. నిజానికి వారు ఎదుర్కొనే అనారోగ్య సమస్యల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఇప్పటికే ఎంతోమంది తారలు అనారోగ్య సమస్యను తట్టుకోలేక చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడుతున్నారని, అయితే ఈ వెన్ను నొప్పి వల్ల ఇబ్బంది పడుతున్నా కూడా ఆయన రాజకీయ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారని సమాచారం అందుతుంది.

ఇకపోతే ప్రస్తుతం జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు ఆ వెన్ను నొప్పి కూడా తిరిగి పూర్తిగా ఆయనను బాధిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు చెబుతున్నా.. ఆయన ఏమాత్రం వినకుండా ఒకవైపు రాజకీయాలలో మరొకవైపు తాను కమిట్ అయిన సినిమా ప్రాజెక్ట్లను కంప్లీట్ చేయడానికి తాపత్రయపడుతున్నట్లు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆందోళనలో ఉన్నట్లు పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుని త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు సమాచారం.

ఇకపోతే కొన్ని నెలల క్రితం ఒక అభిమాని పవన్ పై పడిపోగా ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పికి లోనయ్యారని సమాచారం. ఇకపోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ,భవదీయుడు భగత్ సింగ్ వంటి సినిమాలకు సంబంధించి వేరువేరు షూటింగ్లలో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్ పూర్తి అవగానే 2024 ఎన్నికలు పూర్తయ్యే వరకు మరో కొత్త ప్రాజెక్టులను ప్రకటించే ఛాన్స్ లేదని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు తెలిపినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అవుతారేమో కానీ పాలిటిక్స్ కి మాత్రం దూరం కారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version