బాలయ్య షోలో పవన్ కళ్యాణ్ సందడి చేసేది అప్పుడే..!

-

Pawan Kalyan.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. “అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి” సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత బద్రి, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే సినిమాల పరంగా హీరోగా తనను తాను మరింత ప్రూవ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో మాత్రం ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి. ఎందుకంటే ఈయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన జానీ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనితో మళ్ళీ ఆయన స్వీయ దర్శకత్వంలో సినిమాలు రాలేదు.

అందుకే కేవలం సినిమాలలో హీరోగా మాత్రమే నటిస్తూ మరికొన్ని సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా బాలకృష్ణ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 కి గెస్ట్ గా రాబోతున్నట్లు గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ , మ్యాచో యంగ్ స్టార్ గోపీచంద్ కలసి వచ్చిన ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

ఈ ఎపిసోడ్ పూర్తయిన వెంటనే కొత్త ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ కూడా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కూడా ప్రస్తావించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై ఆయన క్లారిటీ ఇస్తారా? లేదా? అన్నది సందేహంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version