తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి… రాష్ట్రంలో వరసగా ఎన్నికలు వస్తూనే ఉన్నాయి. స్థానిక సంస్థలు, ఎమ్మెల్సీ ఎన్నికలు అలాగే ఉప ఎన్నికలో రూపంలో అనేక ఎన్నికలు వచ్చాయి.
అయితే తాజాగా తెలంగాణలో మరో ఎన్నికలు జరగనున్నాయి. మే నెలలోగా రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా దానికంటే ముందు జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై అందరిలో ఆసక్తి నెలకొంది.
గతంలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నవీన్ కుమార్, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ పదవి కాలం వచ్చే ఏడాది మార్చి 29 తో ఉంది. అటు కాటేపల్లి జనార్దన్ రెడ్డి, మహమ్మద్ అమీనుల్ జాఫరీ, ఫారుక్ హుస్సేన్, డి. రాజేశ్వరరావు పదవీకాలం మే నెలలతో ముగియనుంది. ఇక ఈ ఎన్నికలకు అతి త్వరలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు ఈసారి కేసీఆర్ పదవులు ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది.