తండ్రి కోసం సాహసం చేసిన పవన్ కళ్యాణ్ కూతురు.. షాక్ లో ఫ్యాన్స్

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి తెలుగు రాష్ట్రాలలోనే కాదు యావత్ దేశ సినీ పరిశ్రమలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తనకంటూ నటుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన ఇప్పుడు రాజకీయ ప్రస్థానంలో కూడా జనసేన పార్టీ స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఒక దాని తర్వాత మరొకటి కంప్లీట్ చేస్తూ ఆ వచ్చిన డబ్బులను ప్రజల కోసం రాజకీయాలలో ఖర్చు పెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఏ కూతురు చేయని సాహసం అంత చిన్న వయసులోనే తన కూతురు చేసిన పనికి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు యావత్తు సినీ లోకం ఆశ్చర్యపోతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. సాధారణంగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ సంపాదించుకుంటూ ఉంటారు. వారిలాగే వారి వారసులు కూడా అంతే స్థాయిలో ఇండస్ట్రీలోకి రాకముందే ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంటారు. అయితే మరి కొంత మంది వారసులకు సోషల్ మీడియా ఖాతాలు లేకపోయినా సరే తమ తల్లిదండ్రుల ద్వారా ఫేమస్ అవుతూ ఉంటారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తండ్రి కోసం ఆద్య చేసిన పనిని కూడా ఆమె షేర్ చేయడం జరిగింది.. ఇంతకు ఆధ్యా చేసిన పని ఏమిటంటే తన తండ్రి పవన్ కళ్యాణ్ రాజకీయాలలో గెలవాలి అని , సీఎం కావాలి గంగానదిలో మునిగి మరీ తన కోరికను చెప్పుకొందుట. రేణు దేశాయ్ ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆద్య గంగా నదిలో మునిగినప్పుడు తనకు భయం వేసిందని.. కానీ తండ్రి కోసం చేస్తుండడం చూసి సంతోషం వేసిందని చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ అభిమానులు చిన్నారిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Read more RELATED
Recommended to you

Latest news