టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్న సంగతి అందరికీ తెలుసు. ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన పూరీ జగన్నాథ్.. ఇక తర్వాత దూసుకుపోయాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ ఈ నెల 25న విడుదల కానుంది. కాగా, పూరీ జగన్నాథ్ పవన్ కల్యాణ్ కోసం రాసుకున్న కథలు ఆ తర్వాత రవితేజ వద్దకు వెళ్లాయి. ఆ కథ లేంటి? ఆ సినిమాలేంటి? అన్న సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ జగన్నాథ్ …డైలాగ్స్, స్క్రీన్ ప్లే, స్టోరి అన్నీ కూడా చాలా ఫాస్ట్ గా రాసేసుకుంటుంటారు. ఆయన రచన శైలి ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మేనరిజం అయిన చేయి మెడ మీదకు వెళ్లడం ‘బద్రి’ సినిమా నుంచే స్టార్ట్ అవడం విశేషం. కాగా, ‘బద్రి’లో ‘నువ్వు నంద అయితే నేను బద్రీ బద్రీనాథ్..’ అని పూరీ రాసిన డైలాగ్ జనాలకు బాగా నచ్చింది.
ఈ సంగతులు అలా పక్కనబెడితే పూరీ జగన్నాథ్ తను రాసుకున్న కథల్లో ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ..తమిళ అమ్మాయి’తో పాటు ‘పోకిరి’లను పవన్ కల్యాణ్ కు వినిపించారు. కానీ, ఆయన ఈ స్టోరిలను ఓకే చేయలేదు. అయితే, ఈ స్టోరిలు బాగాలేవు అని చెప్పలేదు. దాంతో ఆ స్టోరిలతో ఇండస్ట్రీ హిట్ సినిమాలు చేశారు దర్శకుడు పూరీ జగన్నాథ్.
అలా పవన్ కల్యాణ్ ఓకే చెప్పని స్టోరిలతో రవితేజ స్టార్ అయపోయాడు. ‘ఇడియట్’ సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ తో పాటు మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా జనాలకు కొత్తగా అనిపించాయి. జనాలు ఈ సినిమా చూసి వావ్ అనుకున్నారు. మొత్తంగా పూరీ జగన్నాథ్ ..రవితేజను స్టార్ చేసే స్థాయిలో సినిమాలు తీశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ‘లైగర్’ తీసిన డైనమిక్ డైరెక్టర్ పూరీ.. నెక్స్ట్ విజయ్ తోనే తన డ్రీమ్ ప్రాజెక్టు అయిన ‘జన గణ మన’ చేస్తున్నారు.