Varun-Lavanya wedding : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిన వివాహం అనంతరం మెగా హీరోలంతా కలిసి ఫోటోదిగారు. కొత్త జంటకు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ విషెస్ తెలిపారు. ఈ ఫోటోను మెగాస్టార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘వారు ప్రేమతో నిండిన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. స్టార్ కపుల్ కు స్టార్ల శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు.
ఇది ఇలా ఉండగా.. టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టస్కానీ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ లో ఈ జంట బుధవారం రాత్రి 7.18 గంటలకు మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టింది. ఇరు కుటుంబాల వారు, అత్యంత సన్నిహితుల మధ్య వరుణ్-లావణ్యల వివాహ వేడుక ఘనంగా జరిగింది.