97 శాతానికి పైగా వెనక్కివచ్చిన 2వేల రూపాయల నోట్లు : ఆర్బీఐ కీలక ప్రకటన

-

రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. ఇప్పటి వరకు 97 శాతానికి పైగా నోట్లు వెనక్కి వచ్చినట్లు తెలిపింది. ఇంకా పది వేల కోట్ల నోట్లు మాత్రమే సర్క్యులేషన్లో ఉన్నాయని వెల్లడించింది.

2023 మే 19న రూ. 2వేల నోట్లు రద్దు చేసేనాటికి దేశంలో రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు సర్క్యూలేషన్​లో ఉండగా.. అక్టోబర్​ 31వ తేదీ నాటికి అందులో 97 శాతానికి పైగా తిరిగివచ్చినట్లు ఆర్బీఐ వెల్లడించింది.  రూ.2000 నోట్ల మార్పిడి/డిపాజిట్ గడువు అక్టోబర్​ 7తో ముగియగా..  రూ.2,000 నోట్లు అక్టోబరు 7 తర్వాత కూడా చట్టబద్ధంగా (లీగల్​ టెండర్​) చెల్లుబాటు అవుతాయని ఆర్​బీఐ తెలిపింది. అయితే కేవలం ఆర్​బీఐ ఇష్యూ ఆఫీస్​ల్లో మాత్రమే మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవడానికి వీలవుతుందని స్పష్టం చేసింది. ఏ బ్యాంక్ బ్రాంచ్​లో రూ.2000 నోట్లను డిపాజిట్​ చేయడంగానీ, ఎక్స్ఛేంజ్ చేయడం గానీ సాధ్యం కాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version