దయనీయ పరిస్థితి..నటుడు ఫిష్ వెంకట్‌కు నిర్మాత ఆర్థికసాయం!

-

సినీ కెరీర్ తొలినాళ్లలో విలన్స్‌కు సహాయకుడిగా నటించిన ఫిష్ వెంకట్.. ఆ తర్వాతి రోజుల్లో కమెడియన్‌గా కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. తను ఆర్థికంగా ఫిట్‌గా ఉన్నసమయంలో ఎన్నో దానధర్మాలు చేసిన ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఎవరైనా సాయం చేస్తారా? అని దీనంగా ఎదురుచూసే స్థాయికి దిగజారిపోయారు. అనారోగ్య సమస్యలు, సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యాడు.

ఈ విషయం తెలుసుకున్న నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఫిష్ వెంకట్‌కు వైద్య, ఆర్థిక సహాయార్థం రూ.లక్ష సాయం అందించారు.టీఎఫ్‌పీసీ ట్రెజరర్ నిర్మాత రామసత్యనారాయణ, టీఎఫ్‌పీసీ సెక్రటరీ టి.ప్రసన్నకుమార్, దర్శకుడు కే అజయ్ కుమార్, తెలుగు ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్‌లు చదలవాడ శ్రీనివాసరావు తరఫున ఫిష్ వెంకట్‌కు చెక్కును అందజేశారు. వెంకట్ మాట్లాడుతూ..‘ నా కష్టాన్ని తెలుసుకుని అడగకుండానే రూ.లక్ష సాయం చేసిన చదలవాడకు ధన్యవాదాలు. మీ సాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. నాతో పాటు నా కుటుంబం ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని పేర్కొన్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news