మెగా కోడలు ఉపాసన తన గురించి కొందరు నెగెటివిటీని ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయం తనను ఎంతగానో బాధిస్తుందని చెప్పుకొచ్చారు. దయచేసి ఇప్పటికైనా ఇలా చేయడం ఆపాలంటూ కోరారు.అపోలో హాస్పిటల్ చైర్మన్, స్టార్ హీరో భార్య అయినప్పటికీ ఉపాసన చక్కటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారనే చెప్పాలి. ప్రతి విషయాన్ని అర్థం చేసుకునే తీరులో మాట్లాడే విధానంలో మెగా కోడలు అనిపించుకుంటూ వస్తున్నారు. అలాగే పెళ్లి సమయంలో తనపై వచ్చిన ఎన్నో కామెంట్లను పట్టించుకోకుండా పాజిటివ్‌గా ముందుకు వెళ్లిపోయారు. తన వ్యక్తిత్వంతోనే మంచి పేరును సంపాదించుకొని గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనిపించుకుంటున్నారు..
మెగా కుటుంబం సైతం ఎప్పటికప్పుడు ఉపాసనను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఎప్పుడు పాజిటివ్ మైండ్ తో కనిపించే ఉపాసన తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అభ్యర్థన ఉంచారు..కొందరు తనపై నెగిటివ్‌ని ప్రచారం చేస్తున్నారని ఇది తనను ఎంతగానో బాధిస్తుందని చెప్పుకొచ్చారు. ఇలా చేయడం దయచేసి ఆపండి అంటూ తెలిపారు. తాను గోల్డెన్ ఫోన్ తో పుట్టానని అందుకే ఎలాంటి కష్టాలు తెలియకుండా పెరిగానని అందరూ అంటూ ఉంటారని కానీ ఈ స్థాయికి రావటానికి తాను ఎంతో కష్టపడ్డాను అని చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి అపోలోను ఆ స్థాయికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. వృత్తి జీవితంలో విశ్రాంతి అనేది లేకుండా వారు గడపడమే కాకుండా తనకు అదే వ్యక్తిత్వాన్ని అలవాటు చేశారని చెప్పుకొచ్చారు. తన పిల్లలను అలాగే పెంచాలని అనుకుంటున్నారని తెలిపారు..
ప్రస్తుతం అపోలో సంస్థల చైర్మన్‌గా ఉన్న ఉపాసన.. బి పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. ప్రతి విషయంలో ప్రజలకి అవగాహన కల్పించడంలో ముందుంటారు. ఏ విషయాన్ని అయినా మొహమాటం పడకుండా ప్రజలకు తెలియ చెప్పాలని చూస్తుంటారు. తన వెనుక వేలకోట్ల సామ్రాజ్యం ఉన్నప్పటికీ ఏ రోజు విశ్రాంతి తీసుకోలేదని చెబుతూ ఉంటారు. ఇప్పటివరకు క్షణం తీరిక లేకుండా పనులు చేసుకుంటూ కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూ వస్తున్నానని తెలుపుతూ ఉంటారు. అయితే ఇన్ని కోట్ల సామ్రాజ్యం ఉండటం విషయం కాదని కానీ దాన్ని సక్రమంగా నడిపించడం కష్టమైన పని అని.. కానీ చాలామంది ఉపాసన గోల్డెన్ స్పూన్ తో పుట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెరిగారని తర్వాత మెగా ఫ్యామిలీ కోడలు అయ్యి ఇప్పుడు మరింత దర్జాగా ఉన్నారని అనుకుంటున్నారు. కానీ దీని వెనక ఎన్నో ఏళ్ల కష్టం ఉందని గుర్తించాలంటూ కోరారు. అలాగే తనపై ఇప్పటికైనా చెడు ప్రచారం మానాలంటూ తెలిపారు..