నాయనా రాజమౌళీ.. దీన్ని చూసైనా పరిస్థితి అర్థం చేసుకో.!

-

‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ మొట్టమొదటి సారి కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా గా ఈ సినిమా తెరకెక్కడం తో నందమూరి మరియు మెగా అభిమానుల లో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది.

ఇదే తరుణంలో బాహుబలి సినిమాలతో రాజమౌళి బీభత్సమైన పాపులారిటీ సంపాదించడంతో..దేశంలో ఉన్న మిగతా ఇండస్ట్రీలలో కూడా ఆసక్తి నెలకొంది. కాగా సినిమా స్టార్ట్ చేసిన సందర్భంలో రాజమౌళి పక్కాగా జూన్ 30వ తారీఖున సినిమా రిలీజ్ అవుతున్నట్లు డేట్ పోస్టర్ పై అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 8వ తారీఖున విడుదలవుతున్నట్లు రాజమౌళి ప్రకటించడంతో నందమూరి మరియు మెగా అభిమానులు రాజమౌళి తీరుపై మండిపడుతున్నారు.

ఊరించి ఊరించి ఇలా మోసం చేయటం ఏంటి జక్కన్న అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే మరికొంతమంది మా హీరోలను వెండితెరపై చూసుకో అక్కర్లేదా నీ సినిమాలలో నటిస్తూ ముసలోళ్ళు అయిపో మంటావా…? అసలు సినిమా రిలీజ్ అవుతుందో లేదో సినిమా రిలీజయ్యాక ఆ ఇద్దరు హీరోలా పరిస్థితి ఎలా ఉంటుందేమో అని జూనియర్ ఎన్టీఆర్ మరియు చరణ్ ల వృద్ధాప్యం టైపు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జక్కన్న పై సీరియస్ అవుతున్నారు. నాయనా రాజమౌళి ఇది  చూసి ఐనా పరిస్తితి అర్ధం చేస్కో అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు ఫోటో కింద.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version