జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదు..నారా లోకేష్‌ కౌంటర్‌ !

-

జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదంటూ నారా లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇప్పటినుంచి జగన్ 2.0 ని చూస్తారని నిన్న వైఎస్ జగన్ కామెంట్స్‌ చేసిన సంగతి తెలసిందే. కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో మీకు చూపిస్తానని వివరించారు. అయితే.. జగన్ చేసిన కామెంట్స్‌ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు.

Nara Lokesh countered that people have not recovered from Jagan 1.0

జగన్‌ ప్రభుత్వ హయాంలో అసలు ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.ఎంతో మంది దళితులు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లను చంపాడని ఆరోపణలు చేశారు. నాపై 23 అక్రమ కేసులు పెట్టాడమని మండిపడ్డారు. శాశ్వత భూచట్టం తెచ్చి ప్రజల భూములనే కాజేద్దాం అనుకున్నాడు… ఇవన్ని ప్రజలు మర్చిపోతారా ? అంటూ నిలదీశారు మంత్రి నారా లోకేష్. జగన్ కి రాత్రి సమయంలో ఆత్మలతో మాట్లాడే చెడ్డ అలవాటు ఉంది అంటూ సెటైర్లు పేల్చారు మంత్రి నారా లోకేష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version