ఢిల్లీ నుంచి తెలంగాణ రేవంత్ కు పిలుపు..నేడు పయనం !

-

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనం కానున్నాడు. ఢిల్లీ నుంచి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కి పిలుపు వచ్చింది. దీంతో.. ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీకి వెళతారు. సాయంత్రం పూట ఢిల్లీకి వెళ్లనున్నారు. నేడు కాంగ్రెస్ శాసనసభ పక్ష ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ భేటీ ఉంటుంది. హైకమాండ్ పిలుపుతో సమావేశం అనంతరం ఢిల్లీకి రేవంత్ వెళతారు.

ఇవాళ సాయంత్రం మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కానున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి రేవంత్ కు అత్యవసర పిలుపుపై రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే… సీఎం మార్పుపై చర్చించేందుకు అని కొందరు, ఇటీవల పార్టీలో జరుగుతోన్న పరిణామాలపై చర్చించేందుకు అని గాంధీ భవన్ లో ప్రచారం జరుగుతోంది. ఇక ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి పయనం కానున్నాడని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version