Polimera 3 : ‘పొలిమేర 3’ వీడియో గ్లింప్స్ ఔట్

-

కరోనా కాలంలో తెలుగు ప్రేక్షకులను అత్యంత అలరించిన సినిమాల్లో పొలిమేర కూడా ఉంటుంది. టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్- విశ్వనాథ్ కాంబోలో తెరకెక్కిన ‘పొలిమేర’ సిరీస్ సినిమాలు ఇప్పటికే రెండు భాగాల్లో వచ్చి మంచి విజయం దక్కించుకున్నాయి. ఈ సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్కు త్రీక్వెల్ (మూడో భాగం) కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ త్రీక్వెల్ నుంచి ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేసి మేకర్స్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు.

ఈ మూడో భాగం కూడా సస్పెన్స్ హార్రర్ థ్రిల్లర్ జానర్లోనే తెరెకెక్కుతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. బబ్లూ పృథ్వీరాజ్ డైలాగ్తో గ్లింప్స్ ప్రారంభమైన గ్లింప్స్లో సత్యం రాజేశ్, గెటప్ శ్రీను కనిపించారు. క్షుద్ర పూజలతో సత్యం రాజేశ్ను కాస్త హార్రర్గా చూపించారు. గత రెండు పార్ట్లలో ఉన్న నటీనటులతోపాటు ఈ త్రీక్వెల్లో మరికొంత మంది కొత్తగా చేరారు. సత్యం రాజేశ్తోపాటు నటుడు బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, పృథ్వీరాజ్, రాకెందు మౌలి తదితరులు సినిమాలో ఆయా పాత్రలు పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version