కాళ్లు మొక్కుతా రేవంత్ సార్.. జర డీఎస్సీ వాయిదా వేయండి అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మొర పెట్టుకున్నారు మహిళా డీఎస్సీ అభ్యర్థులు. టెట్, డీఎస్సీకి మధ్య 22 రోజులే టైమ్.. ఉందని 300 పేపర్ల సిలబస్ ఎట్ల చదవాలి? అంటూ మహి ళా డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు పిల్లల్ని చూస్కుంట చదువుడు కష్టమైతంది….
నా భర్త నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మొర పెట్టుకున్నారు ఓ మహిళ డీఎస్సీ అభ్యర్థి. నా భర్త నమ్మకాన్ని వమ్ము చేస్తనని భయమైతందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
అటు గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్ వాళ్లు బ్రతుకుతారు.. ఒక్క నెల వాయిదా వేసిన ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కి 100 కోట్ల లాభం వస్తది… అందుకే కోచింగ్ సెంటర్ వాళ్లు కిరాయి మనుషులను పెట్టుకొని పరీక్షలు వాయిదా వేయాలని కావాలని ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి.