నా సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి పూజా హెగ్డే. ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నంత మాత్రాన వాళ్లంతా మన కోసం థియేటర్లకు రారన్నారు. ఇన్‌స్టాలో నాకు 27 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.. కానీ వారంతా నా సినిమాలు చూసేందుకు థియేటర్లకు రారని చెప్పారు నటి పూజా హెగ్డే.

చాలా మందికి సూపర్ స్టార్లకు 5 మిలియన్ల కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు.. కానీ వాళ్ల సినిమాలకు కోట్ల మంది వస్తుంటారన్నారు నటి పూజా హెగ్డే. కాగా ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్ లలో పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషల్లో కూడా నటించి మంచి నటిగా గుర్తింపు పొందింది. తన అందచందాలతో పాటు నటనతో కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. పూజా హెగ్డే మొదటిసారిగా నాగచైతన్య నటించిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది ఆ తరువాత వరుస సినిమాలతో అగ్ర హీరోలతో నటించి మంచి అవకాశాలను సంపాదించుకుంది.