రాఘవ లారెన్స్ కి జోడీగా పూజా హెగ్దే..!

-

రాఘవ లారెన్స్ కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాని ఏ స్టూడియోస్ ఎల్ఎల్ పీ, నీలాద్రి ప్రొడక్షన్ , హవీష్ ప్రొడక్షన్ పై కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు కీర్తి సురేష్, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్దే వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి.

అయితే వీరిలో పూజా హెగ్దే ఫిక్స్ అయినట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట. నవంబర్ నెలలో షూటింగ్ ప్రారంభించి.. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అదేవిధంగా హిందీ హిట్ సినిమా కిల్ మూవీకి తమిళ రీమేక్ గా రాఘవా లారెన్స్ 25వ చిత్రం రూపొందుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version