Annavaram: ప్రసాద్ స్కీం కింద 25 కోట్లతో అన్నవరం దేవస్థానం అభివృద్ధి !

-

Annavaram: ప్రసాద్ స్కీం కింద 25 కోట్లతో అన్నవరం దేవస్థానం అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఉందని.. ఈ సంధర్భంగా వివిధ విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఏపీలో టూరిజనికి పెద్దపీట వేస్తున్నామని… గత వైసిపి ప్రభుత్వం టూరిజన్ని పూర్తిగా నాశనం చేసిందని ఫైర్అయ్యారు. అక్టోబర్ 15న కేంద్రానికి టూరిజం డెవలప్మెంట్ కు నివేదిక అందిస్తామని.. 250 కోట్లు కేటాయించడానికి కేంద్రం ముందుకు వచ్చిందని తెలిపారు.

kandula durgesh on anavaram temple

శ్రీశైలం టెంపుల్ టూరిజం అభివృద్ది చేస్తామని.. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు తెస్తున్నాని ప్రకటించారు.బాపట్లలో బీచ్ డెవలప్మెంట్ చేయబోతున్నాం…సంగమేశ్వర ప్రాజెక్టును టూరిజం కారిడార్ గా చేస్తామన్నారు. ఎకో టూరిజం ఇందులో ప్రాధాన్యం ఇస్తామని.. పర్యాటకులు టూరిజం కేంద్రాల్లో మూడు, నాలుగు రోజులు ఆహ్లాదకరంగా గడిపేందుకు మౌలిక వసతులు పెంచుతున్నామని వివరించారు.
గత ప్రభుత్వం కేవలం ఆరోపణకు విమర్శలకు తప్ప టూరిజం అభివృద్ధి చేయలేదన్నారు. అరకు, లంబసింగి, బొర్రకవేస్ లను ఆభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version