హీరోయిన్ గా టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే సినీ కెరీర్ ప్రజెంట్ పీక్స్ లో ఉందని చెప్పొచ్చు. ఈ భామ టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్ వెళ్లింది. ప్రజెంట్ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఫిమేల్ లీడ్ రోల్స్ ప్లే చేస్తోంది.
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’లో కథానాయికగా నటించింది. ఈ నెల 13న విడుదల కానున్న ఇళయ దళపతి విజయ్ ‘ బీస్ట్’, ఈ నెల 29న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలోనూ నటించింది.
పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను సైతం పంచుకుంటూ అభిమానులకు తన సినిమాలు, వ్యక్తిగత జీవిత విషయాలు వెల్లడిస్తుంటుంది ఈ సుందరి. ఈ క్రమంలోనే తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తుంటుంది.
తాజాగా ఈ భామ ‘కచ్చి కైరి ఇట్ ఈజ్’ అనే క్యాప్షన్ తో కంప్లీట్ గ్రీన్ కలర్ డ్రెస్ లో దిగిన ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్ ఇచ్చింది. అలా లుక్స్ తోనే సెగలు రేపుతోంది బుట్టబొమ్మ.
అలా పూజ తను ధరించిన డ్రెస్ పై బటన్ తీసేసి.. నడుము పై చేయి వాల్చి అలా చూస్తూ కుర్రకారు మతి పోగొడుతున్నది. ఫొటోలు చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. ‘ఆసమ్, స్టన్నింగ్,సూపర్, లవ్ లీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ భామ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆస్థాన హీరోయిన్ గా స్థిరపడిపోయింది. త్రివిక్రమ్ మహేశ్ కాంబో ‘ఎస్ఎస్ఎంబీ28’ హీరోయిన్ కూడా ఈమెనే.