బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తొలి చిత్రం ‘అందాల రాక్షసి’తోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచేసుకుంది. చక్కటి అభినయంతో కనబరిచి సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఆమె సుస్థిరం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆ తర్వాత వచ్చిన అవకాశాల్లో విభిన్నమైన పాత్రలను పోషిస్తూ అలా ముందుకు సాగుతోంది ఈ సొట్ట బుగ్గల చిన్నది. ఈ సుందరి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుది.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు వృత్తిపరమైన విశేషాలను పంచుకుంటుంటుంది. ఉగాది సందర్భంగా శనివారం సినీ తారలందరూ శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా శుభాకాంక్షలు తెలిపింది. దాంతో పాటు ఉగాది ట్రీట్ మాదిరిగా తన ఫొటోలను కూడా షేర్ చేసింది ఈ అమ్మడు.
సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో అదరగొట్టింది లావణ్య త్రిపాఠి. వంకాయ రంగు చీరలో మ్యాచింగ్ జాకెట్, ఆభరణాలు ధరించి కొప్పులో మల్లెపూలు పెట్టుకుని అలా నిలబడి, చీరను చూపుతూ కొంటెగా చూస్తూ రకరకాల ఫోజులకు పోయింది. అలా సోకులకు పోయిన సొట్టబుగ్గల సోయగం ఫొటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
చీరకట్టులో అలా ఫ్రంట్, బ్యాక్ అందాలు చూపుతూ లావణ్య సెగలు రేపుతున్నదని అంటున్నారు. చీరకట్టు మనల్ని నిలబెడ్తుందనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను లావణ్య త్రిపాఠి షేర్ చేయడం గమనార్హం. ఇక ఈ భామ ఫొటోలు చూసిన నెటిజన్లు సొట్ట బుగ్గల సుందరి ఇంత అందంగా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.
స్లీవ్ లెస్ జాకెట్లో కంప్లీట్ వంకాయ రంగులో కలిసెట్లు ఆభరణాలు గాజులు వేసుకుంది. ఈ సుందరి ఫొటోలు చూసి నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు చివరగా కార్తీకేయ హీరోగా వచ్చిన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో కనిపించింది.