ప్రముఖ నటుడు కన్నుమూత

-

చిట్టి గుండె నానాటికి బలహీన పడుతుంది. కరోనా.. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. సామాన్యుడినే కాదూ సెలబ్రిటీలను కూడా వదలడం లేదు హార్ట్ స్ట్రోక్. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా, కనీసం నలతగా కూడా అనిపించకుండానే ప్రాణాలను హరించేస్తుంది మాయదారి గుండె పోటు. సినిమా రంగానికి చెందిన అనేక మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. చిరంజీవి సర్జా, పునీత్ రాజ్ కుమార్, తారకరత్న వంటి యంగ్ స్టార్సే కాకుండా.. ఎంతో మంది సీనియర్ నటులు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. ఇప్పుడు మరో స్టార్ టీవీ నటుడ్ని గుండెపోటు బలితీసుకుంది. ప్రముఖ టీవీ నటుడు రీతురాజ్ సింగ్ హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నటుడు అబిత్ బెహ్ల ధ్రువీకరించారు.

కొంత కాలం క్రితం పాంక్రియాస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు. అంతలోనే గుండె పోటుకు గురై మరణించినట్లు వెల్లడించాడు స్నేహితుడు. ఆయన మృతి వార్త తెలియగానే.. సినీ సెలబ్రిటీలు షాక్ వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. రాజస్తాన్ వాసి అయిన రీతూ రాజ్ ఢిల్లీలో చదువుకుని ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. తిరిగి ఇండియాకు వచ్చిన వీరి కుటుంబం ముంబయిలో సెటిల్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news