ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ప్రభాస్.. ఏం పోస్టు పెట్టాడంటే?

-

తాజాగా ప్రభాస్.. తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అది బాహుబలి సినిమాలో కత్తి ఫైట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అది.

అయ్య బాబోయ్.. ప్రభాస్ కు ఇంత ఫ్యాన్ ఫాలోయింగా? ఎంతైనా బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ డార్లింగ్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన రేంజ్ హాలీవుడ్ రేంజ్. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా ప్రభాస్ ఫాలోయింగ్ పెరిగిపోతుందని ఎవ్వరూ ఊహించి కూడా ఉండరు. చివరకు ప్రభాస్ కూడా. దానికి ఉదాహరణే ఇన్ స్టాగ్రామ్.

మామూలుగా సెలబ్రిటీలు సోషల్ మీడియాలో తమ అభిమానులతో టచ్ లో ఉంటారు కదా. ప్రభాస్ కూడా ఇటీవలే ఇన్ స్టా అకౌంట్ తెరిచాడట. ఇన్ స్టా అకౌంట్ ను ఊరికే తెరిచినందుకే ఆయనకు 833000 మంది తన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అయ్యారు. అకౌంట్ అయితే తెరిచాడు కానీ.. అందులో ఒక పోస్ట్ కూడా చేయలేదు. పోస్ట్ చేయకున్నా.. ప్రభాస్ ను లక్షల్లో ఫాలో అవుతున్నారంటే ప్రభాస్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

అయితే.. తాజాగా ప్రభాస్.. తన ఇన్ స్టా అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టారు. ఒక ఫోటోను పోస్ట్ చేశారు. అది బాహుబలి సినిమాలో కత్తి ఫైట్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో అది. లేదా షూటింగ్ సమయంలోనిది అయి ఉండొచ్చు. లేదా రిహార్సల్స్ సమయంలో తీసింది అయి ఉండవచ్చు. ఆ ఫోటోను డార్లింగ్ తన ఇన్ స్టాలో షేర్ చేశాడో లేదో.. అభిమానులు ఆ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసేశారు. ఇంతకీ ఏంటా ఫోటో అంటారా? మీరు పైన చూస్తున్న ఫోటో అదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version