సందీప్ రెడ్డి వంగా కి షాకిచ్చిన ప్రభాస్ ..జీవితంలో ఇక మళ్ళీ స్టార్స్ జోలికి వెళ్ళడు ..!

-

సందీప్ రెడ్డి వంగా టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి సినిమా తీసి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. ఇదే సినిమా విజయ్ దేవరకొండ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. అయితే ఇప్పటికి విజయ్ దేవరకొండ ఆ సినిమా మూడ్ లో నుండి బయటకి రావడం లేదు. అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన ప్రతీ సినిమాలోను విజయ్ అదే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. రీసెంట్‌గా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా విజయ్ అర్జున్ రెడ్డి తరహా లోనే ఉందన్న వచ్చాయి. అంతేకాదు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సందీప్ ఏ హీరోకి వెళ్ళి కథ చెప్పినా అర్జున్ రెడ్డి ఫ్లేవర్ తోనే నెరేట్ చేస్తున్నాడట. దాంతో సందీప్ రెడ్డి వంగా కి ఇంకోసారి కలుద్దాం అన్న మాటే స్టార్ హీరోల నుండి వస్తోంది. ఇక ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్లో కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చాల మంది దర్శకులకి షాకిచ్చింది.

 

వాస్తవంగా ప్రభాస్ ని నాగ్ అశ్విన్ కలిసినట్టు అసలు న్యూస్ రానేలేదు. అయితే నాగ్ అశ్విన్ చెప్పిన కథ ప్రభాస్ కు విపరీతంగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అందరికీ పెద్ద షాకిచ్చారనే చెప్పాలి. ఈ అనౌన్స్ మెంట్ తో ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్న మిగతా డైరెక్టర్స్ కి నెక్స్ట్ సినిమా లేదని క్లారిటీ వచ్చేసింది. వాళ్ళలో సందీప్ వంగా కూడా ఉన్నాడు. అర్జున్ రెడ్డి’.. ‘కబీర్ సింగ్’ సినిమాలతో ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ సక్సస్ ని సొంతం చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా ఇంకా సెట్ కాలేదు. అప్పట్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు కథ వినిపించారని.. మహేష్ కూడా ఇంట్రెస్ట్ చూపించారని అన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ గురించి ఏమైందో. ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో సినిమా ఫిక్స్ అయింది. టీ సీరీస్ వారి నిర్మాణంలో ఆ తెరకెక్కుతుందని ప్రకటన కూడా వచ్చింది. కానీ లాస్ట్ మినిట్ లో రణబీర్ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది.

బాలీవుడ్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో ప్రభాస్ తో సినిమా చేసేందుకు సందీప్ ప్రయత్నిస్తున్నాడని వార్తలు వచ్చాయి. సందీప్ అటు బాలీవుడ్ లో కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి ప్రభాస్-సందీప్ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని అనుకున్నారు. నాగ్ అశ్విన్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాబట్టి అది మిస్ అయినట్టేనని ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న మాట. అంతేకాదు ఇక స్టార్ హీరోల జోలికి వెళ్ళకపోవడం మంచిదని మళ్ళీ ఏ చిన్న హీరోతోనే సినిమా తీసుకుంటా అన్న భావనలో ఉన్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version