భలే ఛాన్స్ కొట్టేసిందిగా.. ప్రభాస్‌ సరసన శ్రీలీల!

-

టాలీవుడ్ హాప్పెనింగ్ హీరోయిన్ శ్రీలీల మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ త్వరలోనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో భాగం కానుందట. ఈ విషయం తెలిసి శ్రీలీల ఫ్యాన్స్ తెగ ఖుష్ అవుతున్నారు. ప్రభాస్-శ్రీలీల జంట అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్ హను రాఘవపూడి స్టార్‌ హీరో ప్రభాస్‌తో ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇందులో హీరోయిన్‌గా శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్టోరీని ప్రభాస్‌, శ్రీలీలకు వినిపించగా వీళ్లిద్దరూ ఓకే చెప్పారట. లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకుంటారని వార్తలు వచ్చినా.. తాజాగా శ్రీలీల పేరు తెరపైకి రావడం గమనార్హం. అక్టోబర్‌ 23 ప్రభాస్‌ పుట్టినరోజున దీనికి సంబంధించి అధికారిక వివరాలు వెల్లడిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version